By
HTTP://sgpawarstudycenter.blogspot.in
దేవుని మందిరం మీద నీకు కోపం వచ్చింది కాబట్టి క్వయర్లో పాటలు పడడం ఆపివేశావు, సంఘ కార్యక్రమాలలో పాల్గొనడం ఆపివేశావు, మందిరమును శుభ్రపరచడం మరియు నీవు నమ్మకంగా చేయుచున్న దేవుని పనిని ఆపివేశావు.
నీ గూర్చి ఎవరో నీకు నచ్చని విధముగా మాట్లాడారని మెల్ల మెల్ల గా మందిరానికి వెళ్లడం మానివేసావు...
వేదిక మీది నుండి ప్రసంగించబడే ప్రసంగాలు అన్ని నీవు అనుకున్న విధముగా రావడం లేదు....
నీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు నిన్ను సంఘములో ఎవరూ పలకరించేలేదు. అంటే నీ ఆలోచన ప్రకారం నీవంటే ఎవరికి పట్టింపు లేదని, నిన్ను ఎవరూ ప్రేమించడం లేదని నీవు అనుకుంటున్నావు.
కానీ దయచేసి నన్ను ఒక్క సారి క్షమించండి.....
నీ కంపెనీలో నీ బాస్ నిన్ను నానా రకాలుగా కించపరిచినా నీవు ఏమి మాట్లాడకుండా పనిచేస్తున్నావు, మరి నీ తోటి ఉద్యోగులు నీ గూర్చి నీ ముందే చేడ్డగా మాట్లాడిన నీవు నోరు ముసుకున్నావు.......(అంటే డబ్బు కొరకే గదా....... ఇవన్నీ నీవు భరించింది.......?)
నీకు ఆరోగ్యం భాగలేనప్పుడు నీ బాస్ నీకు కాల్ చేస్తాడని, నీవు కనబడక పోతే నీ గూర్చి భాద పడుతాడాని నీవు అనుకుంటున్నవా?? లేదా నీవే నీ బాస్ కి ఫోన్ చేసి నీ పరిస్థితి చెప్పలేదా?? నీ దగ్గరికి వచ్చి నిన్ను నీ బాస్ పలకించలేదని ఎప్పుడైనా కంపెనీ మానివేసినావా?? (అలాగు అడిగితే నీ జాబ్ పోతుంది కదా......!)
నీకు గురుతుందా నీ స్కూల్లో నీ ఉపాద్యాయులు, నీ క్లాస్మేట్స్ మరియు నీ బెస్ట్ ఫ్రెండ్స్ నిన్ను గేలి చేసినా నీవు స్కూల్కి వెళ్లడం మానలేదు కదా...
నీవు మందిరానికి రాకుండా ఏ కారణం లేకుండా మానివేేస్తావు కానీ నీ డ్యూటీకి వెళ్లకుండా మానలేవు ఎందుకంటే నీవు ఒకరికి లెక్కచెప్పాలి గదా...
దేవునితో దేవుని మందిరంలో నీకు ఉన్న అపాయింట్ మెంట్ కొరకు నీవు ఎంత ఆలస్యంగానైనా వస్తావు. కానీ వీసా కోసం అపాయింట్ మెంట్ కి 5/6 గంటలు ముందే వెళ్లి కూర్చుంటావు....🤑
నీవు ఎవరిని మోసం చేసున్నావు??
నేను నీ మీద నింద మోపను. ఎందుకంటే నీకు దేవుని మందిరమును గూర్చి సరియైన ప్రత్యక్షత లేదనుకుంటాను...
దయచేసి విను దేవుని మందిరం ఒక క్లబ్ కాదు అంత నీవు అనుకున్నట్లుగా, నిన్ను తృప్తి పరుచుట కొరకు ఏమి జరుగదు..
నీవు మందిరంలో ఇతరులకు ఏమైనా ఏ విషయంలో నైనా సహాయం చేశావా?
దేవుని వాక్య ప్రకారం మొదటిగా క్రీస్తును గూర్చి మరియు సంఘమును గూర్చి ప్రతి విశ్వాసి తెలుసుకోవలసింది ఏమంటే ..... సంఘము ఆయన శరీరం మరియు అది పరలోకానికి దారి....
కాబట్టి ఎవడైనా దేవుని మందిరమును పాడుచేస్తే దేవుడు వానిని పాడుచేయును. జాగ్రత్త.....!
దేవున్ని నీ అవసరం నిమిత్తం అడ్డం పెట్టుకోక ఆయాన్నీ యదార్ధ హృదయంతో సేవించు.... నీ బ్రతుకు నీకు శాశ్వతం కాదు సోదరా......
[24/04 07:33] Pa Suresh Babu: 🕊సీయోనుస్వరం🙏🏼వందనములు
🌾ప్రతిదినవాగ్దానం🌾
📖జెకర్యా 9: 16
👑నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు... దేవుడైన యెహోవా వారిని రక్షించును. ఆమేn
🔹🔹కృపా క్షేమము శాశ్వత జీవాశీర్వాదములు మీకు కలుగును గాక ! ఆమేన్ 🔹🔹
పాస్టర్. షారోన్ రాజ్, రాజమండ్రి.
No comments:
Post a Comment